Facebook Twitter
నవ్వుతూ బ్రతకాలి...!

నేను పుట్టాను
ఈ లోకంలో ఏడ్చింది..!
నేను ఏడ్చాను
ఈ లోకం నవ్వింది..!
నాకింకా ఈ లోకంతో
పని ఏముంది డోంట్ కేర్..!
అన్నాడు ఏనాడో
మన మనసు కవి ఆత్రేయ..!

నవ్వు నాలుగు విధాల చేటని..!
నవ్వు నాలుగు విధాల గ్రేటని...!

నవ్వే వాడు భోగి అని..!
నవ్వని వాడు రోగి అని..!
నవ్వించే వాడు యోగి అని..!

నవ్వేవాని చూట్టే నలుగురుందురని..!
ఏడ్చేవాని చుట్టూ ఎవరూ ఉండరని..!
అందుకే "ఏడ్పు" ఏకాంతంలో
నవ్వు నలుగురిలో అన్నారు మన పెద్దలు

ఔను మిత్రమా..!
ఒక్కోసారి నాకు సైతం అర్థం
కావడం లేదు...నవ్వాలో ఏడ్వాలో..!

నిజానికి ఎవరేమన్నా..!
నవ్వు" నరులకు మాత్రమే ఆ దైవం
అందించిన ఒక గొప్ప వరమని..!
"నవ్వు" ఒక ఔషధమని...నవ్వేవారంతా
అదృష్టవంతులని...ఆరోగ్యవంతులని..!

ఏడ్పు సైతం మంచిదని..!
మన కడుపులోని బాధకు..!
గుండేల్లోని గుబులుకు..!
మనసులోని వ్యధలకు..!
ఒక మంచి మందని...! పలికిన
మానసిక శాస్త్రవేత్తల మాటే శిరోధార్యం