Facebook Twitter
వర్తమానం" ఒక వరం..!

ఓ మిత్రమా ..!
నా ప్రియనేస్తమా..!!
"గతం ఒక భూతం" అని
"చింతించుట ఏల ?
చిత్తంలో ఆ చీకటి ఏల?
"
గతం"గతః అనుకో...

"గతంలో‌ కార్చిన
"ఆ కన్నీటి చుక్కలు"
"రేపటి మంచుముక్కలు...
"నిన్న నేర్చుకున్న
"ఆ గుణపాఠాలు"
"రేపటి దారి దీపాలు..

"వర్తమానం"...
మళ్ళీమళ్ళీ చిగురించని
"ఒక సువర్ణావకాశం"
అందితే "ఆలింగనం" చేసుకో
ఆనందంగా హాయిగా అనుభవించు

"వర్తమానం" ఒక వరం
అది నీకు మాత్రమే
ఆ భగవంతుడు ప్రసాదించిన
"ఒక బంగారు బహుమతి"...అందుకే ఆ
పరమాత్మ పాదారవిందాలకు ప్రణమిల్లు...

"భవిష్యత్తు"
ఒక "బంగారుగని" ఆశతో ఎదురు చూడు
అది వర్తమానంగా మారాలని వరమడుగు