నిత్యం రగలే...నిప్పుల కుంపటి
కొందరు
తప్పుచేసి కూడా
ఈ సమాజంలో
దేనికి భయపడరు...కానీ
ఒక భయస్తుడు...
ఒక బద్దకస్తుడు...
ఒక పిరికి పంద...
ప్రతిరోజూ ఛస్తాడని...
ఒక వీరుడు...ఒక శూరుడు
ఒక్కసారే మరణిస్తాడని...
అన్నాడేనాడో ఆంగ్లకవి షేక్స్పియర్
కానీ అర్థం కాని మర్మమొక్కటే
మానవత్వంలేని ఈ మనుషులు
ఎన్ని తప్పులు చేసినా భయపడరు
కానీ తమ తప్పులు ఎప్పుడు
బయట పడిపోతాయోనని
నిత్యం భయపడుతూనె ఉంటారు
లోలోన కుమిలిపోతూనె వుంటారు
అందుకే...
తప్పు చేసిన వారి అంతరాత్మ
నిత్యం రగలే...నిప్పుల కుంపటే..
ఔనిది నమ్మలేని ఒక నగ్నసత్యమే...



