నీ ప్రశ్నలు నీ జవాబులు…
ఓ మిత్రమా..!
నా ప్రియ నేస్తమా..!
నీవిచ్చే సమాధానాలు...
నీ అనంత మేధస్సుకు
సంకేతాలు...
నీ జ్ఞానానికి...
అజ్ఞానానికి...
నీ అహంకారానికి
నీ అంతరంగంలో
అలముకొన్న
అంధకారానికి...
కాసేటి వెన్నెల
వెలుగులకు ప్రతిబింబాలు...
ఓ మిత్రమా..!
నా ప్రియ నేస్తమా..!
నీవు సంధించే ప్రశ్నలు...
నీ గజిబిజి ఆలోచనలకు గందరగోళాలకు...
గలగలపారే సెలయేరులకు...
జలజలదూకే జలపాతాలకు..
నీలోని ప్రేమ కరుణా కటాక్షాలకు
పగా ప్రతీకారాలలకు
ప్రకృతిలోని
పంచభూతాలను ప్రతిరూపాలు...
అందుకే...
ఆచితూచి మాట్లాడు...
ఆలోచించు మాట్లాడు...
ఆధారాలతో ప్రశ్నించు...
సహనంతో...
చిరునవ్వుతో...
సమయస్పూర్తితో...
సమాధానమివ్వు...చాలు



