Facebook Twitter
పద ముందుకు...ఎందుకు..?

ఓ మిత్రమా..!
పయనించు ...
పయనించు ...
నీ లక్ష్యం విరజిమ్మే
వెన్నెల వెలుగులో...

కమ్ముకున్న
నీ కష్టాల
కారుమబ్బుల్ని
ఛేదించుకొని...
సమస్యల చిమ్మ
చీకట్లను చీల్చుకొని...
అనుమానాల
సంకెళ్లు త్రెంచుకొని...

ఓ నేస్తమా..!
అలసినా...సొలసినా...
ఆగిపోక....ఆగిపోక...
సాహసమే ఊపిరిగా...
సాగిపో.....సాగిపో...
నీ గమ్యం చేరేంత వరకు...

ఎన్ని అవాంతరాల
జడివానలు కురిసినా..‌.
ఎన్ని పిడుగులు పడినా..‌.
ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా...
ఎన్ని సునామీలు చుట్టుముట్టినా...

ఓ నేస్తమా..!
పద ముందుకు...
పద ముందుకు...
ఎందుకు..? ఎందుకు..?
ఘనవిజయాన్ని సాధించేందుకు‌...
విశ్వవిజేతగా కీర్తి గడించేందుకు...