ముందే వుండాలిగా...ముందు జాగ్రత్త
మిత్రమా..!
ఓ నా ప్రియ నేస్తమా..!
నేడు నీకు కావలసిన
దానికోసం
కసితో...
గట్టి పట్టుదలతో...
దృఢమైన దీక్షతో...
పకడ్బందీ ప్రణాళికతో...
ప్రయత్నం చేయకపోతే...
గమ్యమే లక్ష్యంగా
సాధన చేయకపోతే...
సాహసంతో
ముందుకు సాగకపోతే...
నీవనుకున్నది...
కోరుకున్నది సాధించకపోతే...
రేపు నీకు దూరమైన దానికోసం
ఎంత దుఃఖించి ఏమి లాభం..?
రేపు నీవు పోగొట్టుకున్న దానికోసం
ఎంతగా కృంగినా...కుమిలినా...
ఎంతగా ఏడ్చినా...ఏమి లాభం..?
రేపు చేజారిపోయిన దానికోసం
నీవెంతగా చింతించి ఏం ప్రయోజనం..?
నీనొకటి తలంచిన ఆ
దైవమొకటి తలంచినట్టు
ఆశలన్నీ అంచనాలన్నీ
తారు మారయ్యాయని
అలా నీరు కారిపోరాదు
నిరాశతో నిట్టూర్చరాదు
ముందుచూపు ఉండాలి...
ముందు జాగ్రత్త ఉండాలి...
ఆపై ఆ పరమాత్మ అనుగ్రహముండాలి...



