Facebook Twitter
ఒక్కసారి

ఒక్కసారి...
నీ గతంలోకి తొంగిచూడు...
అందమైన అనుభవాన్ని దర్శిస్తావు..!

ఒక్కసారి...
భవిష్యత్తులోకి వంగిచూడు...
అంతులేని ఆశను అనుభవిస్తావు..!

ఒక్కసారి...
నీచుట్టూ తిరిగి చూడు...
అగ్నిలామండే నగ్నసత్యాన్ని గ్రహిస్తావు..!

ఒక్కసారి...
నీలోని ఆత్మను వెలిగించిచూడు...
నీవు ఒక సృష్టికర్త స్వరూపాన్ని..!
నీ జీవితసౌధ నిర్మాతను దర్శిస్తావు..