వీరులెవ్వరు విశ్వవిజేతలెవ్వరు
పుట్టిన రోజు
పండగే అందరికీ
మరి పుట్టింది
ఎందుకో తెలిసేది ఎందరికి...
కృషి ఉంటే...
మనుషులు
ఋషులౌతారు
మహా పురుషులౌతారు
తరతరాలకే
తరగని నిధులౌతారు
ఇలవేలుపులౌతారు...
సాధన...
చేయుమురా నరుడా...
సాధ్యం కానిది లేదురా...
అలవాటైతే విషమేఐనా
హాయిగా త్రాగుట సాధ్యంరా...
అంటూ...
శూరులెవ్వరో...
సాహస వీరులెవ్వరో...
విశ్వ విజేతలెవ్వరో...
విజయానికి దారులెన్నో
విశ్వానికి వివరించారేనాడో
మన "తెలుగు" గేయకవులు



