Facebook Twitter
ఆకులు రాలిన చెట్టే

నీవేదో కోల్పోతున్నావని
కుమిలిపోకు
నీవేదో చిక్కుల్లో...
చిక్కుకున్నానని కృంగిపోకు
నీ చుట్టూ చీకటి...
కమ్ముకున్నదని చింతించకు
నీవు దైవానికి...
దూరమౌతున్నావని దుఃఖించకు

ఆకులు రాలిన చెట్టే
మళ్ళీ చిగురిస్తుంది
కడుపు పండినతల్లే
బిడ్డకు జన్మనిస్తుంది