Facebook Twitter
పైన సూత్రధారి కింద పాత్రధారి

పడిపోతామని...
భయపడితే...
ఎవరికీ...నడక...రాదట
ఎవరూ గమ్యం...చేరలేరట

విడిపోతామని...
భయపడితే...
ఎవరి ఎదలో ప్రేమలు...పుట్టవట
ఎవరికీ...వివాహాలు.....జరగవట

చెడిపోతామని...
భయపడితే...
అందరూ పిరికిపందలేనట
ఏ సాహసకార్యాలు...చేయలేరట

ఓడిపోతామని...
భయపడితే...
అందరూ ఉత్తర కుమారులేనట
ఎవరికీ...ఏ విజయం...సిద్దించదట

ఆపై సభలు...
సమావేశాలు...
మెళ్ళో
పూలహారాలు...
సన్మానాలు...
సత్కారాలు...
కీర్తి కిరీటాలు...
ఏనుగులపై
ఊరేగించడాలు...
మెచ్చుకోవడాలు...
అవార్డులు...రివార్డులు...
ఇచ్చుకోవడాలు...ఉండవట...

అందుకే ఓ మనిషీ..!
ప్రయత్నం నీది...
శ్రమఫలితం నాది...
పని చేయటయే నీ వంతు...
ఫలితం ప్రసాదించుట నా వంతు...
అని భగవద్గీతలో ఏనాడో
ఆ శ్రీకృష్ణ పరమాత్మ పలికినట్లు...

పని ఫలితాలు...
జనన మరణాలు...
గెలుపు ఓటములు...
ఆ పరమాత్మ వరాలని...
ఆ దైవమే సూత్రధారని...
మనిషి ఒక పాత్రధారని...
ఈ నవజీవవన సూత్రం ఎరిగి ఒకసారి
ప్రయాణం సాగించాలట ప్రతిబాటసారి