Facebook Twitter
ప్రతి జీవికి ప్రతిఫలం

ప్రతివ్యక్తి ఒక
అఖండశక్తికి మారుపేరు
చేసే కృత్యాలే వేరు వేరు
దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసి
ప్రతిపనికి ఒక ప్రతిఫలాన్ని
అందించు ఆ పరమాత్మ 
కొందరికి...కోరని వరాలుగా...
కొందరికి...తీరని శాపాలుగా...

సాహితీమూర్తులకు...
గండపెండేరాలు...

ఆదర్శమూర్తులకు...
డప్పులు...మెప్పులు
భారీగా భాజా భజంత్రీలు

త్యాగమూర్తులకు...
క్షీరాభిషేకాలు
సభలు...సమావేశాలు
సన్మానాలు...సత్కారాలు 

ఆశావాదులకు....
పూలదండలు...చప్పట్లు

మానవతావాదులకు...
పల్లకిలో‌...మోయడాలు
ఏనుగులపై...ఊరేగింపులు

అభ్యుదయవాదులకు...
నిస్వార్థ సేవలకు...బిరుదులు
పట్టాభిషేకాలు...విగ్రహప్రతిష్ఠలు

కానీ అవినీతి జలగలకు...
చీదరింపులు...ఛీత్కారాలు

రాజకీయ రాబందులకు...
కోడిగుడ్లు...టమోటాలు
చెప్పుదెబ్బలు...శాపనార్థాలు

కళ్ళుపొరలు కమ్మిన
కామాంధులకు...
చెప్పులదండలు
గుండు కొట్టించి
గాడిదలపై...ఊరేగింపులు
సజీవంగా...సమాధిచేయడాలు