మానవుడే మహనీయుడు
యుక్తి పరుడు శక్తిపరుడు
మానవుడే మహనీయుడు
అంటూ శ్లాఘించాడు
మనిషిని ఒక మహాకవి
పంచభూతాల సాక్షిగా
మానవుడు ఓ జీవాత్మ...
భౌతిక శరీరం...
ఇంద్రియాలు...
మనసు...వాక్కు...
ఆత్మల...కలయికే మనిషి
చక్కని భాషతో...
సత్యవచనంతో...
వాక్ సంస్కారంతో...
తత్వ తర్కశాస్త్ర
పరిశోధనలతో...
విచక్షణాపూర్వకమైన
నిర్ణయశక్తితో...
సద్బుద్ధిని పెంచుకోవడం...
ధర్మబద్ధంగా జీవించడం....
అపారమైన
భక్తి విశ్వాసాలతో
భగవంతున్ని
నిత్యం ఆరాధించడం...
మనిషి నేర్చుకోవాలి
మనిషి సుఖంగా సంతోషంగా
ప్రశాంతంగా జీవించాలంటే...
ఆరు ఆరోగ్యసూత్రాలను
ఖచ్చితంగా ఆచరించాలి
నవ్వు...నడక...పడక...
ఆనందం...ఆరోగ్యం...ఆయుష్షు...



