Facebook Twitter
విజయమా ? వీరస్వర్గమా...?

ఓ మనిషీ..! నీలో
అనంతమైన అఖండమైన
ఆత్మశక్తి దాగి ఉందని...
నీవు అసమర్థుడివి...
అజ్ఞానివి...అవివేకివి...
బలహీనుడవు కాదని...
బలశాలివని...
నీవొక బాహుబలివని...
నీ మనోఫలకంపై లిఖించుకో...

నేనేమీ చేయలేను...
నాకేమీ తెలియదన్న... 
"
పిరికి పిచ్చి పదాలను"...
నీ నరంలేని నాలుకకు నేర్పకు...
వాటిని కలనైనా ఉచ్చరించకు...

ఓ మనిషీ..!
నాకు సర్వం తెలుసని...
నేవేదైనా చేయగలనని...
"ఆ పరమాత్మ"...
నా వాడని...నా నీడని...
నాకు తోడని గట్టిగా విశ్వసించు...

జయించడానికే
నేను జన్మించానని...
ఓటమే నా శత్రువని...
దాన్ని ఎదిరించి...
ఓపిక ఉన్నంతవరకు
కాదు కాదు
ఊపిరి ఉన్నంతవరకు
పోరాడి పోరాడి దాన్ని
చిత్తు చిత్తుగా ఓడించి...
గెలుపు గుర్రమెక్కాలనుకో...