Facebook Twitter
భయపడితే ఏమౌతుంది

భయపడితే...పడిపోతామని...
ఎవరికీ...నడక...రాదట
ఎవరెస్టు శిఖరం ఎక్కలేమట

భయపడితే...విడిపోతామని...
ఎవరికీ...ఏవివాహాలు...జరగవట
ఎదలో ఏ ప్రేమలు పుట్టవట

భయపడితే...చెడిపోతామని...
ఏ సాహసకార్యాలు...చేయలేమట...
ఇక ఎటు చూసినా పిరికిపందలేనట

భయపడితే...ఓడిపోతామని...
ఎవరికీ...ఏ విజయం...సిద్దించదట
ఇక ఎటు చూసినా అసమర్థులేనట