Facebook Twitter
పడి లేచే కెరటాలు...!

పడిపోవడం తప్పు కాదు...
పడిన చోటే పడివుండడం తప్పు...
వేరెవరో వచ్చి అభయహస్తం
అందిస్తారని ఆశించడం తప్పు...

మిమ్మల్ని మీరు నమ్ముకోకపోవడం తప్పు
రాకెట్ లా దూసుకు పోకపోవడం...తప్పు
విధి విషంచిమ్మిందని విలపించడం తప్పు

ఎందుకు ఎలా పడిపోయారో
తెలుసు కోకపోవడం తప్పు...
తిరిగి లేవాలనుకోకపోవడం తప్పు...
క్షణమైనా ఆలోచించక పోవడం తప్పు...

ఓడినా విజయం కోసం
ఆరాటపడే క్రీడాకారులను...
పందిరికి ఎగబ్రాకే లతలను... 
పెరటిలో ఎదగే మొక్కలను...

నిప్పంటుకుని నింగికి 
దూసుకెళ్ళే తారాజువ్వలను...
రోడ్డుపై శరవేగంగా 
పరుగులు పెట్టే వాహనాలను....
పడినా మరుక్షణమే
తిరిగి పైకి లేచే కడలి కెరటాలను...
గాలిలోఎగరే పక్షుల్ని ఎన్నిసార్లు పడినా
వందసార్లు...ప్రయత్నించే చలిచీమల్ని...

గుర్తుకు తెచ్చుకోకపోవడం ...
గుణపాఠాలను నేర్చుకోకపోవడం తప్పు...
చెడతలంపులు మార్చుకోకపోవడం తప్పు

కానీ ఇది పచ్చినిజం
పడిలేచే కెరటాన్ని...
పొడిచే తొలిపొద్దును...
అనుకున్న లక్ష్యంకోసం
విరామెరుగక‌ విశ్రమించే వ్యక్తిని...
ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు...