అదిగో అదిగో సుందర శుభకర శుభోదయం...!!
అదిగో అదిగో కనురెప్పల
తలుపులు తెరుచుకొని...
ఉదయించింది సుప్రభాత వేళ..!
మరో
అరుణోదయ కిరణం..!
ఒక మంగళకర
మహిమాన్విత
సుందర శుభకర దినంతో..!
అపురూపమైన
ఒక జీవిత శుభసందేశంతో..!
ఏమన్నది ఏమన్నది...
ఈ శుభోదయం...? ఈ శుభదినం..?
చెడుఅన్న...
చిమ్మచీకటిని తొలగించుకోమన్నది...
మంచియన్న
చిరుదివ్వెను వెలిగించుకోమన్నది..!
ఏమన్నది ఏమన్నది...
ఈ శుభోదయం..?ఈ శుభదినం..?
ప్రేమ అనే వెన్నెల
వెలుగులను చిరునవ్వులతో
పదిమందికి పంచమన్నది..!
మదినిండా...
సుఖసంతోషాలతో
ప్రశాంతంగా జీవించమన్నది..!
ఏమన్నది ఏమన్నది...
ఈ శుభోదయం..?ఈ శుభదినం..?
పదికాలాలపాటు పచ్చగా ఎదగమన్నది..!
నేడొక్క దినమే కాదు నిండుగా నూరేళ్లు
పిల్లాపాపలతో చల్లగా వర్ధిల్లమన్నది...!!



