నేను పుట్టాను
ఈ లోకం మెచ్చిందీ...
నేను ఏడ్చాను
ఈ లోకం నవ్విందీ...
నేను నవ్వాను
ఈ లోకం ఏడ్చిందీ...
నాకింకా లోకంతో
పని ఏముందీ...డోంట్ కేర్
ఎరగకనమ్మిన
వారి నెత్తికే......చేతులు వస్తాయి
ఎదుటి వారికి
చెప్పేటందుకె...నీతులు ఉన్నాయి
బాధలన్నీ బాటిల్లో
నేడే దించేసెయ్...
అగ్గి పుల్ల గీసేసెయ్...
నీలో సైతాన్ను తరిమేసెయ్...
డ్రైవ్ ది డెవిల్ ఔట్...అంటూ
సినీ గేయ కవి ఆచార్య ఆత్రేయ
ఏనాడో ఈ లోకం యొక్క
నిజస్వరూపాన్ని చిత్రీకరించారు
ఔను మిత్రమా..!
నీవు పిరికిపందలా పిచ్చివానిలా
భయపడుతూ బ్రతికినంత కాలం
వెక్కివెక్కి ఏడుస్తూ ఉన్నంతకాలం
ఈ వెర్రి సమాజం...ఈ పిచ్చి లోకం
నీ కన్నీళ్ళను దోసిటపట్టి త్రాగేస్తాయి
కానీ మిత్రమా..!
నీవు శూరునిలా...
వీరాధివీరునిలా...
విక్రమార్కునిలా...
ధైర్యశాలిగా...బాహుబలిగా...
సాహసంతో ముందుకు సాగితే...
ఈ వెర్రి లోకం...ఈ పిచ్చి సమాజం
భయంతో గజగజ వణికిపోతూ
నీ "పాదాలకు పాలాభిషేకం" చేస్తాయి...
ఇది సత్యం ఇది సత్యం ఇది నగ్నసత్యం



