Facebook Twitter
బండరాళ్ళే బంగారు మెట్లుగా....

మన లక్ష్య సాధనలో...
మన విజయ బాటలో...
ఈ ఆశల ఆరాటంలో...
ఈ జీవన పోరాటంలో...

ఎన్ని అడ్డంకులు...
ఎన్ని అపనిందలు...
ఎన్ని అవరోధాలు...
ఎన్ని అవమానాలు...
ఎన్ని అవాంతరాలు...
ఎన్ని అనుమానాలు...
ఎదురైనా సరే..!

ఎన్ని రాళ్లురప్పలు
విసిరినా సరే...!
ఎన్ని ముండ్లతుప్పలు
ముందున్నా సరే..!

సమస్యలన్నీ విషసర్పాలై
బుసలు కొట్టినా సరే..!
చాటుమాటుగా కాటేసినా సరే..!

అన్నింటిని అద్భుతమైన
అవకాశాలుగా....మార్చుకోగలిగితే..!

విసిరిన విమర్శల బండరాళ్ళనే
బంగారు మెట్లుగా...పేర్చుకోగలిగితే..!

తగిలే...తలపగిలే...ఎన్నెన్నో
ఎదురు దెబ్బలు...  ఓర్చుకోగలిగితే..!

అంతిమంగా
అపజయమన్నదిలేక
అఖండ విజయం నీదేకాదా..!
అందరి ప్రశంసల
వర్షంలో తడిసేది నీవేగదా..!
అప్పుడిక వీరుడివి‌...
శూరుడివి...విశ్వవిజేతవు నీవేగదా..!