నా పెదాలు పలికే నాలుగు వేదాలు..!
ఎంతటి
దూర ప్రయాణమైనా
ఒక్కఅడుగుతోనే ప్రారంభం..!
ఇది నిత్యసత్యం ఇదే ఆణిముత్యం..!
ఒక్కడుగు
ముందున్న కాలు గర్వపడదని..!
ఒక్కడుగు
వెనకున్న కాలికి చింతేలేదని..!
మరుక్షణంలో పడే
మరొక్కడుగుతో పాదాలు
రెండు తారుమారౌతాయని..?
అట్టి కదిలే పాదాల సందేశమొక్కటే...!
పాదాలు రెండైనా...లక్ష్యమొక్కటేనని..!
ఆగక అలసిపోక గమ్యం చేరడమేనని..!
అందుకే
నా కిష్టం...నా రెండు పాదాలు
నా కిష్టం ఆ హరినామ
స్మరణ చేసే...నా రెండు పెదాలు
నా కిష్టం లోకకల్యాణం కోసం
నా సనాతనధర్మం
అందించిన...నా నాలుగు వేదాలు
స్వేచ్ఛ స్వాతంత్ర్యం...
సమధర్మం సమన్యాయం...
సమానత్వం సౌభ్రాతృత్వం...
ఇవే ఇవే నా గుండెల్లో
నిత్యం ప్రవహించే...నదీనదాలు
నిశ్శబ్దంగా ప్రతిధ్వనించే...నిత్యనినాదాలు



