Facebook Twitter
ఆ భగ్న ప్రేమికులకు తెలుసు...

ఎందుకో ఓ ప్రియా

నిను ఎత్తుకోగానే

ఎదకు హత్తుకోగానే

మత్తుగా వుంది

గమ్మత్తుగా వుంది

నాకు అంతా కొత్తగా వుంది

 

కలలు కరిగి పోతున్నాయి

ఆశలు అల్లరిపెడుతున్నాయి

కోరికలు గుర్రాలైపోతున్నాయి

నామనసు నామాట వినడమేలేదు

నాగుండె లయతప్పుతోంది,అది

 

లబ్ డబ్ లబ్ డబ్  అనక

లవ్ లవ్  అంటుంది

లివ్ ఇన్ లవ్  అంటుంది

లవ్ ఈజ్ లైఫ్ అంటుంది

లవ్ ఈజ్ గ్రేట్ అంటుంది

లవ్ ఈజ్ బ్లైండ్ వేర్ యాజ్

లవర్స్ ఫైండ్ మూన్ ఇన్ ది నూన్

అని ఓ కవి అన్నట్లే వుంది

 

మనసు మొద్దుబారి పోయింది

నాకనులకేమీ కనిపించడంలేదు

నా చెవులకేమీ వినిపించడంలేదు

ఈ జగతిలో వున్నది

మనమిద్దరమేనన్న ఒక భావన తప్ప

ఏదో మరో కొత్తలోకంలో ప్రేమపక్షుల్లా

విహరిస్తున్నట్టుగా వుంది

స్వర్గానికి అతిదగ్గరగా వున్నట్టుంది

కానీ,

ఆ ఇద్దరికి తెలుసు

అసలది మత్తుకాదని

మాయకాదని మంత్రం కాదని

అది ఒక పిచ్చిప్రేమయని

లైలా మజ్ను పార్వతి దేవదాసుల

హద్దేలేని అమర ప్రేమయని

ఒద్దూ ఒద్దూ అనుకుంటూనే

వెచ్చని వెన్నెల్లో మసక చీకట్లో

ముద్దుముచ్చట్లో మునిగితేలే

ఆ భగ్నప్రేమికులకు తెలుసు

అది ఒక నగ్నసత్యమని

ఆ ఇద్దరికి తెలుసు ఈ జీవితమే ఒక యుద్దమని

అవసరమైతే కలిసి ప్రాణ త్యాగానికైనా సిద్దమని