పిచ్చి కలపీడకల...?
ఆహా ! చిలకలా వున్నావు
చిరునవ్వు నవ్వుతున్నావు
ఎంత అందంగా వున్నావే
అతిలోకసుందరిలా వున్నావు
చక్కగా వున్నావు ప్రక్కనే కూర్చోవా
ముద్దుగా వున్నావు
ముందుకువంగి ఒక ముద్దుపెట్టావా
కొత్తగా మత్తుగా వుంది
కొద్దిగా నన్ను ఎత్తుకోవా
హాయిగా వుంటుందేమో
ఎదకు నన్ను కాస్త హత్తుకోవా
మైకంలో కింద పడిపోతానేమో
మెత్తని పరుపుమీదకు నన్ను చేర్చవా
ఓ సుందరీ! ఓ సుకుమారీ !
ఎందుకో నాలో నిప్పు రగులుతోంది
దుప్పటిలో దూరి నన్ను కప్పుకోవా
ప్లీజ్ .....ప్లీజ్ .....ప్లీజ్.....
తెలతెలవారింది
సూర్యోదయమయ్యింది
మెలమెల్లగా మెలుకువ వచ్చింది
కమ్మనికల కాస్త కరిగిపోయింది
ఆశ వ్యర్థం అత్యాశ అనర్థం
అని కాబోలు ఆ పిచ్చిపీడకలకు అర్థం



