Facebook Twitter
మూర్ఖులకేది ముగింపు...???

కోరికలు అగ్నిజ్వాలలై రగిలితే

విషసర్పాలై బుసలుకొడితే

 

కామం కట్టలు తెంచుకుంటే

కామంతో కళ్ళు పొరలు‌ కమ్మితే

 

వావి వరసకు,తన, మనకు తావేవుండదు

తప్పులు చేస్తారు తప్పటడుగులు వేస్తారు

 

పట్టపగలే కామాంధులుగా పశువులుగా, 

మానవమృగాలుగా మారిపోతారు,నిజ

ప్రకృతికి విరుద్ధంగా వికృతంగా ప్రవర్తిస్తారు

 

ఆరునెలలు పాపతోనైనా

అరవై ఏళ్ల ముదుసలితోనైనా

కామవాంఛలు తీర్చుకుంటారు

 

సందుల్లో గొందుల్లో నడివీధుల్లో

నక్కినక్కి తిరిగే ఈ గుంటనక్కల్ని

 

కూడుతిని కుండను సైతం

పగలగొట్టే ఈ గజ్జికుక్కల్ని

 

సిగ్గులజ్జ లేకుండా మదమెక్కి

ఊరంతా ఊరేగే ఈ ఆంబోతుల్ని

 

జైల్లో పెట్టడమెందుకో?

కోర్టులో విచారించడమెందుకో?

 

ప్రజలచే కొరడాలతో కొట్టించి, 

కౄరంగా శిక్షించి, నడిరోడ్డుపై ఊరంతా 

చూస్తుండగా ఉరితీయడమే ఉత్తమంగదా

 

నిజమే, తప్పులు చెయ్యనివారు 

లోపాలు లేనివారు ఈ లోకాన లేరు,కాని

 

పాపపు మురికి పేరుకుపోయిన వారిని

నరక కూపంలో కూరుకుపోయిన వారిని

 

సకల శాపాలకు గురైనవారిని మానవత్వమేలేని కామపిశాచుల్ని ఉరితియ్యడం ఉత్తమమే గదా

ఓ అధికారులారా ఓ మేధావులారా ఆలోచించండి