ఓ అమ్మాయిల్లారా !
ఓ అబ్బాయిల్లారా !
పిచ్చి ప్రేమకు స్వచ్ఛమైన
ప్రేమకు అర్థం తెలియని
ఓ అమాయకపు ప్రేమికుల్లారా !
పార్కుల్లో స్వేచ్ఛగా విహరించే
ఓ ప్రేమపక్షుల్లారా !
మీ కిదే నా ప్రేమసందేశం
అమాయకపు అమ్మాయిలంటేనే
గుబాళించే గులాబీ పువ్వులు
ప్రతి గులాబీకి ముళ్ళుంటాయి
మీ చుట్టూ వేయి కళ్ళుంటాయి
గులాబీలు పట్టుకుని కొన్ని గుంటనక్కలు
తియ్యని కబుర్లు చెబుతూ
మీ చుట్టే తిరుగుతుంటాయి
మీ ప్రక్కనే కూర్చుంటాయి జాగ్రత్త
కాలు తగిలితే బస్సుల్లో మీరు
కస్సు బుస్సుమంటారు,కాని పార్కులో
చేయిచేయి చుట్టేసుకుంటారు
హోటల్లో డ్రింక్స్ షేర్ చేసుకుంటూ
సినిమాహాల్లో చీకట్లో సరసాలాడుకుంటూ
తన్మయత్వంలో మునిగిపోతారు
ఆపై లాడ్జిలో తనువులు రెండు ఏకమై
పీకలదాక మత్తులో మైకంలో
ఏదో లోకంలో తేలిపోతూ
గులాబీ పువ్వుల్లా విచ్చుకుంటారు
ఇచ్చుకుంటారు పుచ్చుకుంటారు
గుండెల్లో గుచ్చుకుంటారు
తెలిసి తెలిసి తప్పులెన్నో చేస్తుంటారు
అందుకే,పార్కులో స్వేచ్ఛగా తిరిగే
ఓ ప్రేమపక్షుల్లారా ! జాగ్రత్త !
జీవితానికి చిచ్చుపెట్టె పిచ్చి ప్రేమకు
ఈ రోజే పులుస్టాప్ పెట్టండి !
ఓ అమాయకపు అమ్మాయిల్లారా!
ప్రేమ పేరుతో పచ్చిమోసగాళ్లు విసిరే
కామపు వలల్లో కళ్ళు మూసుకొని
చిక్కుకోకండి, కాలుజారకండి
తప్పుచేసి తల్లిదండ్రులకు
తలవంపులు తేకండి
స్వచ్ఛమైన ప్రేమైతే స్వాగతం
పలకండి హారతి పట్టండి, కానీ
నీచమైన కల్తీప్రేమకు మాత్రం
నిర్మొహమాటంగా
నో చెప్పండి ఆదిలోనే చెక్ పెట్టండి
గులాబీలు పట్టుకొని నక్కినక్కి మీ ప్రక్కనే
గుంటనక్కలు కొన్ని
తిరుగుతూ ఉంటాయన్న ఓ పచ్చినిజం తెలుసుకోండి,
ఇకనైనా, ఈకంప్యూటర్ యుగంలోనైనా కళ్ళుతెరుచుకోండి



