Facebook Twitter
గదిలో గబ్బిలంలా...‌బ్రతక్కు...

ఓ మిత్రమా..!
నా ప్రియ నేస్తమా..!!
బ్రతక్కు బ్రతక్కు
గదిలో
గబ్బిలంలా ..‌
గుడిసెలో
గుడ్లగూబలా..‌.

ఎక్కాలి ఎక్కాలి
ఎక్కి మ్రొక్కాలి
భక్తితో ఏడుకొండలు...
మానవత్వంతో
నిండాలి నీ మండే గుండెలు...

కోరుకోకు...
కోరుకోకు...ఎప్పుడూ
కోపాన్ని ద్వేషాన్ని...
కోపం క్రోధం ఒక శాపం...
పగ ప్రతీకారం ఒక పాపం...
శాంతంగా బ్రతకాలి జీవితాంతం...

ఎందుకు అసూయా ద్వేషం..‌.?
ఎందుకు నక్కలా పగటి వేషం..‌.?
కక్కకు కక్కకు కాలకూట విషం..‌.

మార్పు...నీ పేరు కావాలి
తూర్పు...నీ ఊరు కావాలి
తీర్పుకు..నీవు జడ్జివి కావాలి
ఓర్పు......నీ చిరునామా కావాలి