Facebook Twitter
ఆత్మవిశ్వాసమే నీఆయుధం కావాలి

గెలుపు ఓటములు దైవాధీనములే
ఐనా ఓటమి అంచుకు చేరినా సరే
నీ ఆత్మవిశ్వాసాన్ని వదులు కోవద్దు
విజయమో అపజయమో కరాఖంఢిగా
ఖచ్చితంగా తేలేది చిట్టచివరి నిముషంలోనే
పోటీ కొనసాగు తున్నంతసేపు
నీవు విజయం వైపే చూడాలి
ఓటమిని మనసులో తలంచరాదు 
దాని వైపు చూడరాదు
ఆత్మవిశ్వాసం కొద్దిగా కూడా కోల్పోరాదు
నిరాశను దరిచేర నియ్యరాదు
రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకాలి
దూకుడును పెంచాలి
పట్టుదలతో, కనపడని కసితో 
చిట్టచివరి నిముషం వరకు శ్రమించాలి
స్వేదాన్ని చిందించాలి
ఆరు నూరైనా సరే ఓటమిని ఒప్పుకోరాదు
అర్జునుడికి చెట్టు కొమ్మల్లోని
పక్షి మాత్రమే కనిపించినట్లు
కప్పుమాత్రమే నీ కళ్లకు కనిపించాలి
దాన్ని దక్కించుకోవడానికి నీవు కష్టపడాలి 
అన్ని రకాలుగా ప్రణాళికాబద్దంగా
ఒకరి ప్రేరణతో నీపై గట్టినమ్మకంతో
శతవిధాలా ప్రయత్నించాలి కృషి చెయ్యాలి
ఆఖరు క్షణంవరకు
ఆత్మవిశ్వాసమే నీఆయుధం కావాలి