Facebook Twitter
నేడు విజేతవే... రేపు విశ్వవిజేతవే...!

నేడు నీవొకన్నీటి గీతానివే

కానీ రేపు జలజలదూకే 

జలపాతానివే         

 

నేడు నీవొపాపవే...కనుపాపవే

కానీ రేపు వెన్నెలవెలుగువే

కోవెలలో కొలువైవుండే 

ఓ కులదైవానివే

 

నేడు నీవొక అందనిదానివే...

అంధకారానివే

కానీ రేపు...

ఆ అంధకారాన్ని చీల్చి

వెలుగులు విరజిమ్మే 

అరుణోదయ కిరణానివే

 

నేడు నీవొక...

మట్టిలో దాగిన విత్తనానివే

కానీ రేపు విశ్వమంతా 

విస్తరించే మహావృక్షానివే

 

నేడు నీవొక బండరాయివే....

శిధిలమైన శిలవే

కానీ రేపు ఒక కమ్మని కలవే ..

అందమైన అలవే

 

నేడు నీవొక బెదురుచూపుల జింకవే

కానీ రేపు అడవిలో గజరాజువే...

గాండ్రించే పులివే

 

నేడు‌ నీవొక...

చెరువులో చేపవే...

బావిలో కప్పవే

కానీ రేపు సంద్రంలో 

తిరుగులేని ఓ తిమింగలానివే

 

ఔను అంతా మంచే జరగాలంటే...

మన కథ కంచికి చేరాలంటే...

కాలం కలిసి రావాలి...

కనిపించని...ఆ దైవం కరుణించాలి...ప్రేమను కురిపించాలి