99 మంచి లక్షణాలు
వున్నవాడు నిజానికి Hero నే
కాని
ఎన్ని (10 )సార్లు ఫోన్ చేసినా
ప్రక్కనే ఫోన్ ట్రింగ్ ట్రింగ్ మని
మోగుతున్నా ఎత్తకుండా
ఏ చలనంలేకుండా వుండే
ఒక (చెత్త) చెడు లక్షణం వుంటే చాలు
వాడు నిజంగా Zero నే
99 మంచి లక్షణాలు
చక్కని పాలకుండలో
చిక్కని పాలైతే
ఎన్ని(10 )సార్లు ఫోన్ చేసినా
ప్రక్కనే ఫోన్ ట్రింగ్ ట్రింగ్ మని
మోగుతున్నా ఎత్తకుండా
ఏ చలనంలేకుండా వుండే
ఒక (చెత్త) చెడు లక్షణమన్నది
ఆ పాలకుండలో విషపు చుక్కే
99 చక్కని లక్షణాలు
వున్నవాడు చుక్కల్లో చంద్రుడే
కాని
ఎన్ని (10 )సార్లు ఫోన్ చేసినా
ప్రక్కనే ఫోన్ ట్రింగ్ ట్రింగ్ మని
మోగుతున్నా ఎత్తకుండా
ఏ చలనంలేకుండా వుండే
ఒక (చెత్త)చెడు లక్షణం వుంటే చాలు
వాడు అమాావాస్య చంద్రుడే
ఇది చదివి అర్ధం చేసుకున్న
తక్షణమే తప్పును సరిదిద్దుకున్న
వెంటనే మేలుకొన్నవాడి
బ్రతుకు బంగారమే మేలిమి బంగారమే
కాని అర్ధం చేసుకోకుండా
తన తప్పును తాను సరిదిద్దుకోకుండా
అహంకారంతో వున్నవాడి
బ్రతుకు అంధకారమే గాఢాంధకారమే



