Facebook Twitter
ఎవడు భాగ్యవంతుడు ???

సహనం సర్దుబాటుగుణం లేని
మంచితనం మానవత్వం లేని
పట్టుదల ఓర్పులేని ఏ మనిషీ

అనుకున్న లక్ష్యాన్ని ఛేదించలేడు
ఆ విధిని ఎదిరించలేడు
ఘనవిజయాన్ని సాధించలేడు

కాస్త ధమ్ము ధైర్యము కాస్త నమ్మకము పట్టుదల
వున్నవాడే పదికాలాలపాటు పచ్చగా వుంటాడు

అవిలేనివాడు ఏమీలేని వాడుగా
ఏదీరానివాడుగా చేతగానివాడుగా
అన్నీవున్నా అవిటివాడుగానే మిగిలిపోతాడు

ఉత్కృష్టమైన ఈ మానవ జన్మ
అర్థం పరమార్థం ఎరిగిన వాడు
ఉన్నతమైన భావాలు ఉన్నవాడు
ఉన్నత శిఖరాలను అవలీలగా అధిరోహిస్తాడు

మన జన్మకు కారకుడు
మన జాతకాలు తారుమారు చేసే ఆ భగవంతున్ని
అనునిత్యం ఆరాధించేవాడే అదృష్టవంతుడు
భగవన్నామ స్మరణ చేసేవాడే భాగ్యవంతుడు