కనిపించక వీచే గాలి మన
కళ్ళకు కనిపించేదెప్పుడు ?
స్వర్గ నరకాలెక్కడున్నాయి?
రెండు కళ్ళతో చూసిందెవరు?
ఈ జననం నిజం ఈమరణం నిజం
ఈ జనన మరణాలకంతమెప్పుడు?
వ్యక్తి శక్తి భక్తి ముక్తి
ఈ పదాల అంతరార్థమేమిటి?
అదిగో ఏనాడో కట్టిన
మన కళ్ళముందే వున్న
ఆ ఖరీదైన ఇంద్రభవనాన్ని
కట్టినవాడొకడున్నాడు దానికి
ధనం సమకూర్చినవాడున్నాడు
చక్కని ప్లాన్ వేసిన వాడున్నాడు
అన్నది నిగ్గుతేలిన నిజమైనప్పుడు
ఈ అవంతమైన ఈ అద్బుతమైన
ఈ అఖండమైన సృష్టి పుట్టుకకు ఒక
వ్యక్తి కాని ఒక శక్తి కాని వుండి వుంటారు
మన ఈ కళ్ళకు కనపడక దర్శించలేనివి
మన స్వహస్తాలతో ముట్టి స్పర్శించలేనివి
లేవనుకున్నవి విశ్వంలో చాలానే ఉన్నవి
అన్నది నిగ్గుతేలిన నిజమైనప్పుడు...
ఈ చిక్కుప్రశ్నల ముడి విప్పేదెవరు?
ఈ పిచ్చి ప్రశ్నలకు చికిత్స చేసేదెవరు?
అన్నింటికి సమాధానం ఒక్కటే
నమ్మకం - నమ్మకం - నమ్మకం
నమ్మినవాడు ఆస్థికుడు
నమ్మనివాడు నాస్తికుడు
గుడ్డుముందా కోడి ముందా
చెట్టు ముందా విత్తు ముందా అన్నవి
ఎంతకూ ఎన్నటికీ ఎప్పటికీ తేలనట్లే
ఈ వింత ప్రశ్నలు కూడా అంతేనేమో...



