Facebook Twitter
ఎన్నో ప్రశ్నలిక్కడ సమాధానాలెక్కడ?(Part - 1)

ప్రతి రైలు ఇంజన్లో ఒక డ్రైవరు
ప్రతి హాస్పటల్లో ఒక డాక్టరు
ప్రతి బ్యాంకులో ఒక మేనేజరు
ప్రతి గర్భగుడిలో ఒక దేవుడు
కాదు దైవం సర్వాంతర్యామి
సర్వశక్తిమంతుడు అది ఆ
పరమాత్మనకు ప్రతిరూపమే మరి
నిజమైన ఆ సృష్టికర్త నివాసమెక్కడ?

భూమ్యాకాశాలను,సముద్రాలను
సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించిన
ఆ దేవుడు సృష్టికి ముందు ఎక్కడ?
ప్రస్తుత మెక్కడ వుంటున్నట్టు ?
ఏమి తింటున్నట్టు ?

నిజంగా దేవుడు నిరాకారుడేనా?
ఐతే రూపమేలేని దేవుడికి పేరెక్కడిది?

అసలు భగవంతుని భాషేమిటి?మన
భాష భగవంతుడికి అర్థమౌతుందా?

సృష్టి జరిగిన తర్వాత
ఏ ఒక్కరికైనా దైవదర్శనం జరిగిందా?

దైవంతో ముఖాముఖిగా
లేదా అదృశ్యంగానైనా
సంభాషించిన వారెవరైనా వున్నారా?

సృష్టిలో మొట్టమొదట జన్మించిన
మొట్టమొదట మరణించిన
మనిషి ఎవరు?ఎప్పుడు ?ఎక్కడ ?ఎలా ?

సృష్టిలే మరో జన్మ మనుషులకేనా 
జంతువులకు పశుక్ష్యాదులకు లేదా?

మూగజంతువులకు
పశుక్ష్యాదులకు దేవుడెవరు?

మౌనమే మూగజంతువుల బాషనా?
ఐతే అవి మనతో మాట్లాడేదెప్పుడు ?