వృక్షాలే దేవతలు
నిన్నటి
ఓ చిన్న మొక్క
నేడు వృద్ధిచెంది
వృక్షమై కొమ్మలతో
రెమ్మలతో చల్లని
నీడ నిచ్చేనురా
కమ్మని ఫలాలతో
కడుపు నింపేనురా
పచ్చని వృక్షాలేరా
పరోపకారానికి
ప్రత్యక్ష సాక్ష్యాలు
నిజమే కదరా ఓ మానవా!
ఆక్సిజన్ అందిస్తోంది
ఆయుష్షును పోస్తోంది
కొమ్మలతో రెమ్మలతో
అమ్మలా సేవ చేస్తోంది
మాయదారి మనిషికన్న
మాటలురాని మ్రానే శ్రేష్టంరా
నిజమే కదరా ఓ మానవా!
మిట్టమధ్యాహ్నం వేళ
నింగిలో సూర్యుడు
భగభగమని మండుతూ
నిప్పులు చెరుగుతున్న
నిశ్చలంగా నిలబడి మ్రాను
గొడుగులా నీడనిచ్చేనట
నేలకొరిగి వరకు తనను
గొడ్డలితో నరికి వారికైనా
నిజమే కదరా ఓ మానవా!



