విధి అంటే ఒక విపత్తు
అనుకోని ఒక ఆపద
ఆకస్మికంగ హఠాత్తుగా
మన ప్రమేయం లేకుండా
జరిగే ఒక ప్రమాదం
అందరిని ఆశ్చర్యానికి
భయబ్రాంతులకు గురిచేసే
ఒక దుస్సంఘటన
కాని చిరుచిరు ఉపాయాలతో
ఎదురయ్యే అనేక అపాయాలను
తెలివిగా తప్పించుకోవచ్చు
ఎన్ని ఆటంకాలు అడ్డంకులు
ఎన్ని అవరోధాలు అవాంతరాలు వచ్చినా
ఎన్ని ఇబ్బందులు కష్టనష్టాలు వచ్చినా
ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా
కృంగిపోక, కుమిలిపోక, నిరాశ చెందక
చలించక, వెరవక, వెనుదిరిగక
ముందుకే మున్ముందుకే
గురిపెట్టిన లక్ష్యసాధన వైపే
భయమన్నదే మదిలోపుట్టక
బాణంలా దూసుకుపోవచ్చు
విధిని ఎదిరించవచ్చు
విజయాన్ని సాధించవచ్చు
వీరుడిగా శూరుడిగా
విజేతగా విశ్వవిజేతగా
వెయ్యేళ్ల వరకు ప్రజలు నిన్నే
గుర్తుంచుకోవచ్చు నీకు గుడి కట్టవచ్చు
ఒక దైవంలా నిన్ను పూజించవచ్చు
చరిత్రలో నీవు చిరంజీవి కావచ్చు
ఔను ఇదినిజం ఆశే నీ శ్వాస ఐతే
సాహసమే నీ ఊపిరి ఐతే
విశ్వాసమే నీ ఆయుధమైతే
అఖండ విజయమే నీ ఆశయమైతే



