నేను ఒలింపిక్స్ లో పాల్గొంటా
కష్టపడి పోరాడి కప్పు గెలుస్తా
నేను ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేస్తా
అక్కడ మన మువ్వన్నెలజెండాను ఎగరేస్తా
నేను బాహుబలిలా యుద్ధం చేస్తా
ఉగ్రవాదమూకల్ని వధిస్తా విజయాన్ని సాధిస్తా
నేను గజఈతగాళ్లలా సప్తసముద్రాలను ఈదేస్తా
గిన్నీస్ బుక్ రికార్డులను తిరగరాస్తా చరిత్రనుసృష్టిస్తా
విజయీభవ ! దిగ్విజయీభవ !! ఐతే వెళ్ళువెళ్ళు
ముందుకెళ్ళు బాణంలా దూసుకెళ్ళు భయపడకు
"ప్రేమతో గురువుగారి దీవెన"
నేను బలహీనున్ని బద్దకస్తున్ని ఇలాగే బ్రతికేస్తా
లేదాఎత్తైన బిల్డింగ్ ను ఎక్కి క్రిందికి దూకి ఛస్తా
ఓరి వెధవా ఓరి శుంఠా వెళ్ళు వెళ్ళు వెనక్కివెళ్ళు
చచ్చి సాధించేదేముందిరా ఓ పిరికిపందా
చచ్చే ముందు ఏదైనా ఒక్క మంచిపనైనా చేసిచావు
"కోపంతో గురువుగారి శాపం"
దొరకడం దురదృష్టం
గడప దాటి గుట్టును రట్టుచేసి
ఊరంతా తిరిగే ఊరేగే భార్య
దొరకడం ఇంకా దురదృష్టం
అది గతజన్మలో చేసిన పాపాలకు ఫలితం
దానితో పరువు గంగలో కలిసిపోతుంది,
బ్రతుకు భారమౌతుంది గాఢాంధకారమౌతుంది
ఆ బాధ ఆ క్షోభ ఆ వేదన ఆ నరక యాతన
తన ఆత్మకు ఆ పరమాత్మకే తప్ప ఎవరికెరుక?



