Facebook Twitter
దగాకోరులమీద నిఘా…

ముందుచూపులేని వారికి చుట్టేమి
జరుగుతుందో పట్టించుకోనివారికి
మూర్ఖుల మాటలు వినేవారికీ
మంచి మాటలు చెబితే వినని వారికి
చిక్కులే... చింతలే... చీకాకులే...
మున్ముందు అన్నీకష్టాలే అన్నీనష్టాలే

మన చుట్టూరవున్న
వారంతా మేక వన్యపులేనని
నమ్మించి నవ్వుతూ నట్టేటముంచే
నయవంచకులని నమ్మకద్రోహులని
కడుపులో కత్తులుంచుకొని కౌగలించుకొనే
కసాయివాళ్ళని తేనెపూసిన పదునైనకత్తులని

ఘోరంగా నష్టపోయేంతవరకు
దారుణంగా మోసపోయేంతవరకు
చివరి నిముషం దాక తెలుసుకోకపోవడం
అవివేకమే....అజ్ఞానమే...అమాయకత్వమే

ఔనికనైనా నిజం తెలుసుకొని, నిద్రమేల్కొని
ఈ దగాకోరులపై నిఘాపెట్టకున్న పెనుప్రమాదమే