Facebook Twitter
వంటలు వండండి ! ఆకలిమంటలు తీర్చండి!!

పసందైన
నోరూరించే
రుచికరమైన
కనువిందుచేసే
వంటకాలు పలరకాలు
తయారుచేసే చిట్కాలు కోకొల్లలు

రైస్ + రసం + పప్పు
= పప్పన్నం

రైస్ + మటన్ + మసాల
= దమ్ము బిర్యాని

రెండు ఆకలితీర్చే వంటలే
కానీ ఒకటి శాకాహారం మరొకటి మాంసాహారం
రెండింటి రుచికి
కావాలి చిటికెడు ఉప్పు
చేస్తారిక్కడే‌ చిన్న తప్పు

ఆ ఉప్పుకాస్త ఎక్కువైతే
నోటికి రుచించదు
తక్కువైనా తంటానే...
సమపాళ్లలో ఉంటేనే
తినేవారికి తృప్తి...
అన్నదాతకు...ఆత్మతృప్తి
చేసినవారికి ప్రశంసా...
పాకనైపుణ్యానికి...పరీక్ష

మొదటిది....వచనమైతే.....
రెండవది....కవిత్వమే
కవులారా ఇక మీరు
ప్రతినిత్యం వండే మీ వంటలో
ఉప్పుఉందో లేదో చూసుకోండి
కవిత్వం వ్రాసుకోండి !
కమ్మని కవితలతో పాఠక దేవుళ్ళ
కడుపు నింపండి !
ప్రేమను ప్రశంసను గౌరవాన్ని
గుర్తింపును పొందండి !