Facebook Twitter
గుహలోవున్న పులి - గూటిలోవున్న పక్షి

గుహలోవున్న ఏ పులినోట్లోకి ఏ జింకపిల్ల

 వచ్చిపడదు, దాని ఆకలి తీరాలంటే
గుహనుండి పులి బయటికి రాక తప్పదు
ఆహారంకోసం అడవిలో వేట ఆరంభించక తప్పదు

గూట్లో ఉన్న ఏ పక్షి నోట్లోకి ఏ ఆహారం
వచ్చిపడదు, దాని ఆకలి తీరాలంటే
ప్రతిపక్షి నిద్రలేచింది మొదలు  
ఆకాశంలో ఆహారంకోసం విహరించక తప్పదు
వేలమైళ్ళు వెళ్ళక తప్పదు తిండికై వెదకక తప్పదు

కలలు కంటే సరిపోదు ఏ విద్యార్థి ఐనా
కలెక్టర్ కావాలని,ఆ ఉద్యోగం రావాలంటే
పరీక్షలు వ్రాయక తప్పదు పాస్ కాక తప్పదు

ఇంటర్వ్యూలకని ఆఫీసుల చుట్టూ తిరగక తప్పదు

కోరుకుంటే సరిపోదు ఏ ఆటగాడైనా
కప్పుకొట్టాలని ఆటలో ఘనవిజయం సాధించాలంటే
ఏ ట్రైనర్ దగ్గరైనా గట్టి శిక్షణ తీసుకోక తప్పదు
రాత్రియంబవళ్లు పట్టుదలతో ప్రాక్టీస్ చేయక తప్పదు

ఆశపడితే సరిపోదు ఏ తండ్రిఐనా
అమెరికా సంబంధం రావాలని కావాలని
కన్నకూతురి పెళ్లి అంగరంగవైభవంగా చేయాలంటే
కాళ్ళు విరిగేలా చెప్పులు అరిగేలా
సంబంధాల కోసం ఊర్లన్నీ తిరగక తప్పదు
అడ్డమైన వారిని అడగక తప్పదు