సృష్టి మీదనే కొందరి దృష్టి
కొందరు చరిత్రను సృష్టిస్తారు
కొందరు చరిత్రను తిరగ వ్రాస్తారు
కొందరు చరిత్రను చదువుతారు
కొందరు అవకాశాలను సృష్టిస్తారు
కొందరు అందిన అవకాశాలను
సద్వినియోగం చేసుకుంటారు
కొందరు వచ్చిన బంగారు అవకాశాలను దుర్వినియోగం చేసుకొని
ఇక ఎన్నటికీ తిరిగిరాని అవకాశాలకోసం కన్నులు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటారు
మానవ జీవితాలతో
ముడిపడివి మూడు
సంపద
పెట్టుబడి
పొదుపు
కొందరు సిరిసంపదల్ని సృష్టిస్తారు
కొందరు ఆదాయాన్ని ఆర్జిస్తారు
కొందరు జీతం పుచ్చుకుంటారు
మన మధ్యనే ఉంటారు
ఎప్పుడూ ఈ ముగ్గురు, వీరిలో
కొందరు ఉత్తములు
కొందరు మధ్యములు
మరికొందరు అధములు, కానీ
తమ శక్తి యుక్తుల్ని ఉపయోగించే
వ్యక్తులకు మాత్రమే సృష్టి మీద దృష్టి



