లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం
పెద్దకష్టమేమీ కాదు,కాని
అక్కడికి చేరుకోవడమే బహుకష్టం
కాస్త సాధన చేస్తే
కాస్త సాహసం చేస్తే
కాస్త ప్రయత్నం చేస్తే
కొన్ని ప్రతిబందకాలని దాటేస్తే చేరుకోవడం పెద్దదూరమేమి కాదు
అంత భారమేమి కాదు
కాని గట్టిపట్టుదల వుంటే
చేరాలన్న తపన వుంటే
లక్ష్యాన్ని చేరుకోవచ్చు
ఆ గమ్యాన్ని చేరుకునే
కొత్తమార్గాన్ని కనిపెట్టాలి
కొంత త్యాగం చెయ్యాలి
లక్ష్యసిధ్ధికి తప్పక ఆత్మశుద్ధి కావాలి
నేను పర్వతాలను కదిలిస్తాని
నేను అగ్నిని మింగేస్తానని
నేను సముద్రాన్ని త్రాగేస్తానని
అకుంఠదీక్షతో అడ్డంకులకు వెరవక
లక్ష్యాన్ని మరువక
నిరంతరం గమ్యాన్ని గుర్తుచేసుకొంటూ ముందుకే సాగితే
చివరి అడుగు ఆవలితీరం వరకే
చిమ్మచీకటిని చీల్చుకు వచ్చేది వేకువవెలుగే
కొండంతవెలుగు నిచ్చేది గోరంతదీపమే
వీధి చివరనున్నా సరే నీ చూపు విజయశిఖరం వైపే వుంటే
గురి తప్పని లక్ష్యమెంతటి
కష్టమైనా సంక్లిష్టమైనా
కసితో కృషితో
నిరంతర సాధనతో
ఛేదించడం సాధ్యమే
లక్షమైళ్ళదూరమైనా
ప్రారంభం ఒక్కఅడుగుతోనే
అసలు లక్ష్యసాధనంటేనే
ప్రఙ్ఞను నిరూపించే
ఒక మహాయజ్ఞమే



