ఓ నా భరతమాత ముద్దుబిడ్డలారా
మీరు పాపులు కాదు పవిత్రులు
మీరు వృద్ధులు, బలహీనులు కాదు
మీరు అనంత శక్తి సంపన్నులు
మా వల్లకాదు మేమేమీ చెయ్యలేమనకండి
పిరికితనంతో బానిసలుగా బ్రతక్కండి
వీరులై విజయశంఖారావం పూరించండి
ఓ నా భరతమాత ముద్దుబిడ్డలారా
మేము ఏదైనా సాధించగలమనే
అఖండ విశ్వాసంతో వుండండి
మనకు కావలసింది ఇప్పుడు
ఇనుప కండరాలు ఉక్కునరాలు
చాలకాలం ఏడ్చారిక ఏడ్పులాపండి
చిరుత పులులై ముందుకు దూకండి
ఓ నా భరతమాత ముద్దుబిడ్డలారా
లేవండి మీరు సింహాలని గుర్తుంచుకోండి
మీ గమ్యం చేరేవరకు మీ పరుగు ఆపకండి
భయపడకండీ ధైర్యంగా బలంగా వుండండి
బలము సత్సంకల్పమే అభివృద్ధికి సోపానం
బలమహీనతే మృత్యువుతో సమానం
ఓ నా భరతమాత ముద్దుబిడ్డలారా
బద్దకం మనకు ఒక బద్దశత్రువు అది ఒకరోగం
ఆ రోగంతో బయట తిరిగే హక్కు మీకెక్కడిది?
వెలిగే సూర్యున్ని చూస్తే చీకటి భయపడుతుంది
శ్రమించే మనిషిని చూస్తే ఓటమి భయపడుతుంది
విలువైన కాలాన్ని సద్వినియోగం చేసుకోండి
విశ్వవిజేతలై భరతమాతకు అఖండ కీర్తినార్జించిండి



