Facebook Twitter
అట్టి వారితో నాకు పనేలేదు....

ఒక మంచిమాట చెబితే
వినని వారితో నాకు పనేలేదు

అనుమానించే అవమానించే
వారితో అసలు నాకు పనేలేదు

అనుభవగ్నులను గౌరవించడం
తెలియని వారితో నాకు పనేలేదు

పైకి ఒక మాట లోపల ఒక మాట
చెప్పేవారితో మాటమార్చి మాయ
మాటలు మాట్లాడే వారితో పనేలేదు

పక్కవాడికి చిన్నసహాయం కూడా 
చెయ్యలేని వారితో నాకు పనేలేదు

ఎదురుపడితే ప్రేమతో పలకరించడం
చేతగాని వారితో నాకు పనేలేదు

మంచి సలహాలిస్తే సూచనలు చేస్తే
స్వీకరించలేని వారితో నాకు పనేలేదు

కడుపులో కత్తులుంచుకొని,నవ్వుతూ
కౌగలించుకొనే వారితో నాకు పనేలేదు

జబ్బుపడినవారిని జాలితో, ప్రేమతో
పలకరించరాని వారితో నాకు పనేలేదు

మేము పట్టిన కుందేటికి మూడేకాళ్ళని
మూర్ఖంగా వాదించే వారితో నాకు పనేలేదు

నన్ను అభిమానించే వారే
నన్ను అర్థం చేసుకున్న వారే
నా ఆలోచనల్ని అపార్థం చేసుకోనివారే
నా ఆత్మ బంధువులు నా ప్రాణమిత్రులు

వారే నాకు ఆదర్శం
వారే నా ఆత్మీయులు
వారికే దక్కును గాక !
నా ప్రేమాభినందనల