అట్టి వారితో జరా భధ్రం…
అదిగో...
వారు ఎవరినీ నమ్మరు
ఎందుకంటే...
వారు ఎంత చెప్పినా వినరు కాబట్టి
అందుకే అట్టి వారితో జరా భద్రం మిత్రమా.......
అదిగో...
వారు మట్టి ఏనుగులే
ఎందుకంటే... వారిని నమ్మి
గోదారి ఈదడం పెద్దప్రమాదం కాబట్టి
అందుకే అట్టి వారితో జరా భద్రం మిత్రమా.......
అదిగో...
వారు బావిలో కప్పలే
ఎందుకంటే... వారికి
తెలివిగా బ్రతకడం తెలియదు కాబట్టి
అందుకే అట్టి వారితో జరా భద్రం మిత్రమా.......
అదిగో...
వారు రెక్కలున్నా ఎగరలేని పక్షులే
ఎందుకంటే... వారికి
పైకి ఎగరడం ఎలాగో తెలియదు కాబట్టి
అందుకే అట్టి వారితో జరా భద్రం మిత్రమా.......
అదిగో...
వారు కడుపులో కత్తులుదాచుకుంటారు
ఎందుకంటే... వారికి
పగ ప్రతీకారాలు తప్ప ప్రేమించడం తెలియదు
అందుకే అట్టి వారితో జరా భద్రం మిత్రమా.......