Facebook Twitter
అట్టివారితో జట్టు కట్టుట ఏల ?

నటించే వారితో...
నట్టేటముంచే వారితో...
రాక్షసులతో రాబందులతో...

నీచులతో...
నికృష్టులతో...
చీడపురుగులతో...
చిరునవ్వులు నవ్వే
చిరుత పులులతో...

కడుపులో
కత్తులుంచుకొని
కౌగిలించుకునే వారితో...
మొండివాళ్ళతో...
మోసగాళ్లతో...మొసళ్ళతో...

నయవంచకులతో...
నరరూప రాక్షసులతో...
పందులతో పందికొక్కులతో...
లోతుగా గోతులు తీసే కోతులతో...

బ్రతకాలని ప్రార్ధిస్తూనే
మరణానికి మందులిచ్చే
మాయగాళ్లతో...మంత్రగాళ్ళతో...
కుక్కలతో...నక్కలతో...తోడేళ్ళతో...

జట్టు కట్టి తిరిగే వారి
జాతకాలు క్షణాల్లో
తారుమారైపోతాయి !
కోటి పాపాలు వేటకుక్కల్లా వెంటబడతాయి !
శతకోటి శాపాలు మెడకు
చుట్టుకుంటాయి జాగ్రత్త !