Facebook Twitter
కాలాతీత,విఖ్యాత? విశ్వ విజేత ఎవరు?

ఓ యువకా!
నిరాశపడవద్దు
నీరుగారి పోవద్దు
సింహం పంజా విసిరినట్టు
చిరుత పరుగు పెట్టినట్టు
మొండిగా వుండు దైర్యంగా వుండు
నిలబడకుండు నిప్పులా మండు

మొన్న ఓడినా నిన్న గెలిచావు
నిన్న పడినా నేడు లేచావు
నన్ను నిన్ను నడిపేది
నమ్మకమేనని, ఆ నమ్మకమే
నీ గెలుపు ఆయుధమని గుర్తుంచుకో

ఓడిపోవడానికి ఇష్టపడితే
గెలుపు కష్టం
కావాలి నిరంతరం గెలుపే నీమంత్రం
మిషన్ గన్నును మించిపో
రేసుగుర్రంలా రెచ్చిపో

కసీ, కృషీ, తపన, పట్టుదల
వుంటే చాలు,అధిరోహించవచ్చు
అవలీలగా,ఉన్నత శిఖరాలెన్నో,ఎన్నెన్నో

ఔను,పిరికితనం ఒక రోగమే
పులి తన ఆకలిని తీర్చుకోవాలన్నా
పులినుండి జింక తప్పించు కోవాలన్నా
రెంటికీ కావలసింది మెరుపు వేగమే

కన్న కమ్మనికలలు నిజమైతే
అనుకున్న లక్ష్యం చేరువైతే
కోరుకున్న ఫలితమే దక్కితే ఇక
నీవే కదా కాలాతీత, విఖ్యాత విశ్వ విజేతవు
నీకే కదా సకల సన్మానాలు సత్కారాలు
నీవే కదా ముందు తరాలకు ఆదర్శము