లోపాలు ...పాపాలు... శాపాలు..
మన మనసులో
దూరిన దుష్టతలంపులే
భయపెట్టే భూతాలు
అసూయ,అత్యాశ,అహంకారాలే
కక్ష ద్వేషం పగా ప్రతీకారాలే
మోసం దగా దౌర్జన్యాలే
మనలో వుండే పెద్ద లోపాలు
ఆ లోపాలు పెరిగితే పాపాలౌతాయి
ఆ పాపాలు ముదిరితే శాపాలౌతాయి
ఆపై మన బ్రతుకులు నరకకూపాలౌతాయి
జీవితాలు ఆరిపోయే దీపాలౌతాయి