ఏ ప్రయాణమైనా
ఒక అడుగుతోనే ప్రారంభం
ఏ గమ్యమైనా
ఒక లక్ష్యంతోనే ప్రారంభం
ఏ పెళ్లయినా
ఒక తాళితోనే ప్రారంభం
ఏ తల్లి మాతృత్వమైనా
ఒక బిడ్డతోనే ప్రారంభం
ఏ శుభకార్యమైనా
ఒక సస్సంకల్పంతోనే ప్రారంభం
ఏ పనయినా
ఒక ప్రయత్నంతోనే ప్రారంభం
ఏ ప్రతిఫలమైనా
ఒక పట్టుదలతోనే ప్రారంభం
అందుకే
అతిగా అదేపనిగా
ఆలోచించేవాడు
కాదు అదృష్టవంతుడు
ఒక మంచి ఆలోచన
వచ్చీరాగానే
దాన్ని ఆచరించేవాడే
అదృష్టవంతుడు
ఒక మంచి ప్లాట్
కొనాలనుకొని పడుకొని
కమ్మని కలలు కనేవాడు
కాదు కోటీశ్వరుడు
కొనాలనుకున్న వెంటనే
ఒక ప్లాన్ ప్రకారం త్వరగా
నిర్భయంగా నిర్ణయం తీసుకొని
ప్లాట్ కొనేవాడే కోటీశ్వరుడు
ఆపై
ఆ అదృష్టవంతుడికి
ఆ కోటీశ్వరుడికి
దక్కేవి మూడు
అవి ఆనందం - ఆస్తి - గౌరవం
కాని ఒక దురదృష్టవంతుడికి
ఒక దరిద్రుడికి
దక్కేవి కూడా మూడే
అవి దుఖం - అప్పు - అవమానం
ఒక ప్రాబ్లమ్ ఒక పామైతే
పట్టుకొని బుట్టలో పెడితే
చుట్టచుట్టుకొని పడుకొంటుంది
ఒక ప్రాబ్లమ్ ఒక పామైతే
నాగస్వరమూదితే
నాట్యమాడుతుంది
ఒక ప్రాబ్లమ్ ఒక పామైతే
పట్టి సంచిలోపెట్టి
అడవిలో దూరంగా వదిలి వస్తే
తనదారిన తానువెళ్ళి అడివిలో
స్వేచ్ఛగా తిరుగుతుంది
ఒక ప్రాబ్లమ్ ఒక పామైతే
పెద్దపామైనా చిన్నకర్రతో
కొట్టక పాపమని వదలి వేస్తే చివరికి
ఎవరికో ఒకరికి హాని జరుగుతుంది
తిరిగి చాటుమాటుగా వస్తుంది
కాటు వేస్తుంది ప్రాణం తీస్తుంది



