Facebook Twitter
విజయానికి పది సూత్రాలు - పోలయ్య కూకట్లపల్లి

1. ఆత్మవిశ్వాసమే ఉంటే ఎంతటి ఘనవిజయాన్నైనా సాధించవచ్చు
2. 100 ఆలోచనలకన్నా ఒక్క ఆచరణ మిన్న
3. ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా దానిపట్ల
దృఢమైన నమ్మకముండాలి. గట్టిపట్టుదల వుండాలి.
సాధించి తీరాలన్న తపన ఉండాలి
4. మంచిపని చేయడానికి ప్రతిరోజూ‌ మంచిరోజే ప్రతి ఘడియ ఒక మంచి ముహూర్తమే
5. ప్రతిదానికి సందేహించేవాళ్ళు
మొహమాట పడేవాళ్ళు జీవితంలోఎప్పటికీ ఎదగలేరు. ధైర్యం చేస్తేనే ధనవంతులౌతారు
లేదంటే ఎప్పటికీ పేదవాళ్లుగానే మిగిలిపోతారు
6. ఫలితం రాకున్నా కష్టపడి పనిచెయ్యాలి
ఒకనాటికి ఆ శ్రమే ఊహించని ఫలితాలనిస్తుంది గొప్పగుర్తింపును తెస్తుంది
7. నేడు అద్భుతాలు సృష్టించినవారంతా
నిన్న ఆర్థికంగా చితికిపోయినవారే
8. నేడు నీవు కాలాన్ని ప్రేమిస్తే అది నిన్ను "హీరో"ను చేస్తుంది ద్వేషిస్తే అది నీ జీవితాన్ని "జీరో" చేస్తుంది
9. ప్రతి మనిషి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి
దాన్నే నిత్యం స్మరించుకోవాలి
దానినే దర్శించుకోవాలి. దానికోసమే జీవించాలి
10. బద్దకం మనిషికి బద్దశత్రువే కాదు
అది ఒక ఊబిలాంటిది. అది ఒక సజీవ సమాధిలాంటిది. దాన్ని ఆశ్రయిస్తే
అది నిన్ను పచ్చని మొక్కలా ఎదగనివ్వకపోగా
అధఃపాతాళానికి అణగద్రొక్కుతుంది జరా జాగ్రత్త !

   హైదరాబాదులో ఒక   ప్లాటు వుందంటే
అది మిమ్మల్ని ఆపదలో ఆదుకుంటుంది
అది నిన్నటి మీ అప్పుల్ని రేపు తీర్చివేస్తుంది

హైదరాబాదులో ఒక ప్లాటు కొంటే
అది నేడు మీ కూతురుకి బహుమతి
అది రేపు కాబోయే మీ అల్లుడికి కట్నం

హైదరాబాదులో ఒక ప్లాటు వుందంటే
అది సమాజంలో మీకు గొప్ప గౌరవం
అది మీ ఆర్థిక క్రమశిక్షణకు కొండంత గుర్తు

హైదరాబాదులో ఒక ప్లాటు కొంటే
మీ భార్యా పిల్లలు మిమ్మల్ని తెగ ప్రేమిస్తారు
మీ బంధువులందరు మిమ్మల్ని
ఎంతగానో అభిమానిస్తారు

హైదరాబాదులో ఒక ప్లాటు వుందంటే
అది ముమ్మాటికీ ఒక స్టేటస్ సింబల్

హైదరాబాదులో ఒక ప్లాటు కొంటే
అది మీకు కొండంత ధైర్యం ఏనుగంత బలం

అన్న పోలన్న సుభాషితం విన్న మీకు శుభోదయం