పంజరంలోని పక్షికి స్వేచ్ఛలేదు
కాని వేళకింత తిండి దొరుకుతుంది
ఎటువంటి ప్రాణభయం శత్రుభయం లేకుండా
కంటి నిండ నిద్రపోతుంది
ఆకాశంలో ఎగిరే పక్షికి ఎంతో స్వేఛ్ఛ ఉంటింది
కాని తిండి కోసం ఎక్కడెక్కడో
గూడు వదలి తిరగాలి ఎంతో దూరం వెళ్లాలి
తిరిగి గూడు చేరేవరకు
అడుగడుగునా గండాలే ప్రాణభయమే
ఎవరు వల విసురుతారోనని
ఎక్కడ ప్రాణం తీస్తారోనని
చిన్న ఆక్వేరియంలో
ఉన్న చేపకు స్వేచ్ఛలేదు
కాని వేళకింత మేతదొరుకుతుంది అది
ఏ భయము లేకుండా సుఖంగా ఉంటుంది
చెరువులోనో సముద్రంలోనోవున్న
చేపకు చాలా స్వేఛ్ఛ ఉంటుంది కాని
క్షణక్షణం ప్రాణభయమే
ఏ తిమింగళం మింగివేస్తుందోనని
ఏ వలలో చిక్కుకొని
గిలగిలా కొట్టుకోవలసి వస్తుందోనని
ఏ గాలానికో తగులుకొని
విలవిల లాడాల్చి వస్తుందోనని
స్వేఛ్ఛ ఎక్కడో ప్రాణభయమక్కడ
జననమెక్కడ మరణమక్కడో
వెలుగు ఎక్కడో చీకటి అక్కడ
సుఖం ఎక్కడో దుఃఖం అక్కడ
ప్రక్కప్రక్కనే వుంటాయి
అన్నీ కలిసే వుంటాయి కాని
కంటికి కనపడకుండా వుంటాయి



