ఒక వ్యక్తి
అఖండ విజయాన్ని
సాధించాడంటే....
ఎన్నో సార్లు గెలిచి,ఓడిపోయి ఉండాలి
ఆ వ్యక్తి గొప్ప మేధావి అంటే....
ఎన్నో వేల పుస్తకాలు చదివి ఉండాలి
ఎంతో అపారమైన జ్ఞానాన్ని
మేధస్సును కలిగి ఉండాలి
ఆ వ్యక్తి అతి సుందరమైన
శిల్పాలను చెక్కాడంటే
వారి నైపుణ్యం శక్తి ఆసక్తి అనంతం
ఒక రైతు పొలం నుండి
ధాన్యం ఇల్లు చేరిందంటే ఆ రైతు
ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపి
ఎన్నో కన్నీటిచుక్కల్ని రాల్చి ఉండాలి
ఆ వ్యక్తి ఎన్నో సాహితీ సాంస్కృతిక
కార్యక్రమాలను సభలను సమావేశాలను
అట్టహాసంగా ఆరంభించి
అద్భుతంగా నిర్వహించి
ఆ బాలగోపాలాన్ని అలరించి
దిగ్విజయంగా ముగించాడంటే
ఆ వ్యక్తి వ్యక్తి కాదు ఒక శక్తి అని అర్థం
ఎంతో ఓర్పు నేర్పు సహనం సమయపాలన
కృషి పట్టుదల కార్యదక్షత కలుపుగోలుతనం
ఆవ్యక్తి సొంతమైతేనే... నిజానికి
ఆ వ్యక్తి ఒక త్యాగశీలి ఒక స్నేహశీలి
ఒక పట్టువదలని విక్రమార్కుడైతేనే అది సాధ్యం



