కొండంత ఆశతో…
గత వందేళ్లలో ఎన్నడురాని
కలలో కూడా ఊహించని
నిన్నటివరకు ఎడతెరిపిలేకుండా
కురిసిన కుంభవర్షాలతో
....గిలగిల లాడిపోయిన
..."విలవిల"లాడిపోయిన
మీ అందరి ముఖాలు నేడు
..."కళకళ"లాడాలని
పెదవులపై చిరునవ్వుల
దివ్వెలు వెలగాలని
మీరు బడిలోపిల్లల్లా
..."కిలకిల"మని నవ్వాలని
నిన్నటి వరకు
సకల సమస్యలతో
..."భగభగ"మండిన మీ బ్రతుకులు
నేడు దసరా పండుగ సందర్భంగా
..."ధగధగ" లాడిపోవాలని
మీరు మీ కుటుంబ సభ్యులందరూ
సకల సిరిసంపదలతో
సుఖసంతోషాలతో భోగభాగ్యాలతో
ఆయురారోగ్య ఐశ్వర్యాలతో
ఆనందంగా హాయిగా
సంతోషంగా ప్రశాంతంగా ఉండాలని
దివ్యమైన దీవెనలు మీపై
"కుంభవర్షాలై" కురవాలని
..."జలజల"మని జలపాతాలై
దివి నుండి భువికి దిగిరావాలని
..."గలగల"మని సెలయేరులై
గంగాయమునలై ప్రవహించాలని
కొండంత ఆశతో...కోరుకుంటున్న....
దసరా శుభాకాంక్షలతో...



