ఏకాగ్రతవుంటే విజయం మీవెంటే
కరగని
మనసును కరిగించడం
కదలని
రాయని కదిలించడం
కదిలే వ్యక్తుల్ని
పరుగులు పెట్టించడం
పరుగులు పెట్టే
వారిని గమ్యం చేర్చడం
ప్రతిభావంతుల ప్రధానలక్షణం
గురిచూసి బాణం విసిరితే
గుండెల్లో గుచ్చుకుంటుంది
జింకపిల్ల ప్రాణం పోతుంది
అది వేటగాడి చాకచక్యం
బలంగా కాలితో తన్నిన
బంతి వేగంగా పైకి లేస్తుంది
గాలిలో చక్కర్లు కొడుతుంది
అది బంతిలోని గాలిప్రభావం
కాసింత నిప్పురాజేస్తే చాలు
ఏ తారాజువ్వైనా రివ్వుమని
నింగిలోకి దూసుకువెళ్తుంది
ఔను ఆకాశమే దానికి హద్దు
వాటన్నిటి సందేశమొక్కటే
విలువల్ని ఎన్నడూ వీడవద్దని
అవకాశాలను వదులుకోవద్దని
అభివృద్ధి అన్నమాట మరువవద్దని
నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా బ్రతకమని
ఏకాగ్రతతోచేస్తే ఏపనైనా విజయం తథ్యమని



